సందడిగా ‘యాదాద్రి’
ABN, First Publish Date - 2021-06-20T14:46:09+05:30
లాక్‌డౌన్ ఎత్తేయడంతో ఆలయాలకు భక్తులను అనుతిస్తున్నారు. యాదాద్రిలో ఈ రోజు నుండి స్వామివారి దర్శనాలను ఆలయ అధికారులు ప్రారంభించారు.
యాదాద్రి-భువనగిరి: లాక్‌డౌన్ ఎత్తేయడంతో ఆలయాలకు భక్తులను అనుతిస్తున్నారు. యాదాద్రిలో ఈ రోజు నుండి స్వామివారి దర్శనాలను ఆలయ అధికారులు ప్రారంభించారు. భక్తులకు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ స్వామి వారి దర్శనాలతో పాటు ఆర్జిత సేవలలో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. అభిషేకాల అనంతరం 9 గంటల నుంచి భక్తుల దర్శనాలను ప్రారంభించారు. భక్తుల రాకతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధి సందడిగా మారింది. లాక్‌డౌన్ ఎత్తివేయడంతో 37 రోజుల తర్వాత దర్శనాలను ఆలయ అధికారులు పునరుద్దరించారు. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
Updated Date - 2021-06-20T14:46:09+05:30 IST