ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడలతో మానసిక ప్రశాంతత

ABN, First Publish Date - 2021-10-13T05:26:56+05:30

క్రీడలతో మానసిక ప్రశాంతత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హనుమకొండ స్పోర్ట్స్‌, అక్టోబరు 12: క్రీడలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని డీసీపీ పుష్ప అన్నారు. తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ వరంగల్‌ ఆధ్వర్యంలో హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల క్రీడా మైదానంలో కాకతీయ రాణిరుద్రమదేవి ఓపెన్‌ టూ ఆల్‌ బాలికల, మహిళల చాలెంజర్‌ క్రికెట్‌ కప్‌ టోర్నీ పోటీలు మంగళవారం ముగిశాయి. హోరాహోరీగా జరిగిన ఫైనల్‌లో ఆరెంజ్‌ టీమ్‌ వర్సెస్‌ బ్లూ టీమ్‌ల మధ్య జరిగిన పోరులో బ్లూ టీం ఆరెంజ్‌ టీమ్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆరెంజ్‌ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 16 ఓవర్లకే 70 పరుగులు సాధించి ఆల్‌ ఔట్‌ కాగా, తదుపరి బ్యాటింగ్‌ బరిలోకి దిగిన బ్లూ టీమ్‌ 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఏడు వికెట్ల తేడాతో ఛేదించింది. పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుష్ప హాజరై  విజేతలకు ట్రోపీని  అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు పి.విజయచందర్‌రెడ్డి, బాలాజీ జూనియర్‌ కళాశాల డైరెక్టర్‌ శివకుమార్‌, టీసీఏ సభ్యులు ఎండీ ఆలీమోద్దిన్‌, టీసీఏ సంయుక్త కార్యదర్శి షమి అక్మల్‌, వి.శశంక్‌, ఎం.నవరసన్‌, ఎ.నిఖిల్‌ వై.సుమన్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-10-13T05:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising