ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎఫ్వోఎంపై ప్రత్యేక శిక్షణ

ABN, First Publish Date - 2021-04-11T08:35:19+05:30

సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కొత్తగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సీఎంఆర్‌, ఏడబ్ల్యూఎస్‌ సంస్థలు శనివారం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎంఆర్‌, ఏడబ్ల్యూఎస్‌ మధ్య ఒప్పందం

మేడ్చల్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు కొత్తగా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సీఎంఆర్‌, ఏడబ్ల్యూఎస్‌ సంస్థలు శనివారం ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా మేడ్చల్‌ మండలం కండ్లకోయలోని సీఎంఆర్‌ గ్రూపు సంస్థ, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) ఆధ్వర్యంలో ‘క్రిటికల్‌ ఫెసిలిటీ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌’ (సీఎ‌ఫ్వోఎం) పై ప్రత్యేక శిక్షణను అందిస్తున్నాయి. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ విభాగాలకు చెందిన విద్యార్థులకు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ రూపొందించిన పాఠ్యాంశాలను అధ్యాపకుల తోడ్పాటుతో నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంతో పాటు కళాశాలలో నిర్వహించే క్యాంపస్‌ సెలెక్షన్లకు అవసరమైన నైపుణ్యాన్ని అందిపుచ్చుకోగలరని సీంఎఆర్‌ గ్రూపు కళాశాల సెక్రటరీ సీహెచ్‌.గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వినియోగం, డేటా సెంటర్ల మౌలిక సదుపాయాలు పెరుగుతుండడంతో మేనేజ్‌మెంట్‌ రంగంలో ఉపాఽధి అవకాశాలు కూడా పెరగనున్నాయని, క్రిటికల్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని గోపాల్‌రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు.

Updated Date - 2021-04-11T08:35:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising