ఆనందయ్య మందుకు విశేష స్పందన
ABN, First Publish Date - 2021-07-20T07:46:47+05:30
నెల్లూరుకు చెందిన ఆనందయ్య కరోనా మందును మంచిర్యాలలో సోమవారం పంపిణీ
మంచిర్యాల, జూలై 19 (ఆంధ్రజ్యోతి): నెల్లూరుకు చెందిన ఆనందయ్య కరోనా మందును మంచిర్యాలలో సోమవారం పంపిణీ చేశారు. ఈ మందుకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచారసభ (ఏబీఏపీ) ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ఆనందయ్య సోదరుడి కుమారుడు ప్రణవ్ ఉచితంగా మందు పంపిణీచేశారు. మందు కోసం జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సుమారు 40 వేల మందికి మందు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
ఉదయం 10 గంటలకు మందు పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించగా, ఆరు గంటల నుంచే ప్రజలు బా రులుతీరారు. ఏబీఏపీ రాష్ట్ర అధ్యక్షుడు రాచర్ల రమేష్, ప్రధాన కార్యదర్శి బేతి తిరుమల్‌రావు, జిల్లా గౌరవ అధ్యక్షుడు గాజుల ముఖే్‌షగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-20T07:46:47+05:30 IST