ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షమించండి.. కొవిన్‌ యాప్‌ ఓపెన్‌ కావట్లేదు

ABN, First Publish Date - 2021-03-02T08:39:33+05:30

కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని టీకా కేంద్రాలకు వచ్చిన ఎంతోమంది నిరాశకు గురయ్యారు. కొవిన్‌ యాప్‌ ఓపెన్‌ కావడం లేదంటూ రాష్ట్రంలోని చాలా జిల్లాల ఆస్పత్రులు లబ్ధిదారులను వెనక్కి పంపించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు

అడ్డగుట్ట/తాండూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కొవిన్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకొని టీకా కేంద్రాలకు వచ్చిన ఎంతోమంది నిరాశకు గురయ్యారు. కొవిన్‌ యాప్‌ ఓపెన్‌ కావడం లేదంటూ రాష్ట్రంలోని చాలా జిల్లాల ఆస్పత్రులు లబ్ధిదారులను వెనక్కి పంపించాయి. సర్వర్‌ డౌన్‌ కావడంతో పలుచోట్ల లబ్ధిదారుల ఫోన్‌ నంబరును ఎంటర్‌ చేశాక ఓటీపీ రాలేదు. ఇంకొన్ని చోట్ల ఒక్కో లబ్ధిదారుడి ఫోన్‌ నంబరుకు ఓటీపీ రావడానికి సగటున 20 నిమిషాలు పట్టింది. దీంతో క్యూలో నిలబడ లేక ఎంతోమంది ఇళ్లకు తిరిగి వెళ్లిపోయారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి వచ్చిన దాదాపు 43 మంది ఇలా వెనుదిరిగారు. యాప్‌లో సమస్య కారణంగా వారంతా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు క్యూలో ఎదురుచూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత యాప్‌ తెరుచుకోవడంతో 65 మందిలో 22 మందికి టీకా ఇచ్చారు. మిగతా వారు టీకా తీసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. వారందరికీ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రాజారావు క్షమాపణ చెప్పారు. 

Updated Date - 2021-03-02T08:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising