ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈఆర్‌సీ భవనానికి సౌర సొబగులు

ABN, First Publish Date - 2021-12-09T07:45:21+05:30

సంప్రదాయేతర (సౌర) విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకునేలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భూమి పూజ చేసిన గవర్నర్‌ తమిళి సై

హైదరాబాద్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సంప్రదాయేతర (సౌర) విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకునేలా హైదరాబాద్‌లో మరో భవన నిర్మాణం జరగనుంది. దీనికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ) శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తెలంగాణ సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ(టీఎస్‌ రెడ్‌కో).. నెట్‌ జీరో ఎనర్జీ బిల్డింగ్‌ కట్టాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని మింట్‌ కాంపౌండ్‌లో 3100 చదరపు గజాల విస్తీర్ణంలో ఐదంతస్థుల నెట్‌జీరో ఎనర్జీ భవనం నిర్మించనుండగా... అదే దారిలో టీఎ్‌సఈఆర్‌సీ నడవనుంది. లక్డీకాపూల్‌లో 1767 గజాల విస్తీర్ణంలో ఈ భవన నిర్మాణం చేపట్టనుంది. ఈ భవన నిర్మాణానికి బుధవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ భూమి పూజ చేశారు.


అనంతరం ఆమె మాట్లాడుతూ టీఎ్‌సఈఆర్‌సీ నిర్మించే పర్యావరణహిత నెట్‌ జీరో ఎనర్జీ భవనం రాష్ట్రానికి రోల్‌మోడల్‌గా నిలవాలని ఆకాంక్షించారు. ఇంధన వనరుల వినియోగం నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణహితంగా ఈ భవనాన్ని నిర్మించనున్నామని టీఎ్‌సఈఆర్‌సీ చైర్మన్‌ శ్రీరంగారావు అన్నారు.   


Updated Date - 2021-12-09T07:45:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising