ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూనిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం

ABN, First Publish Date - 2021-10-27T05:28:52+05:30

భూనిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 భూపాలపల్లి కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

చెల్పూరు, అక్టోబరు 26: భూనిర్వాసితులకు చట్ట ప్రకారం పరిహారంతోపాటు పునరావాసం కల్పించాలని  కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా అన్నారు. చెల్పూరు కేటీపీపీలోని గెస్ట్‌హౌ్‌సలో సింగరేణి, జెన్‌కో అధికారులతో ఆయన మంగళవారం సమావేశమయ్యారు. జెన్‌కోకు అవసరమైన గణపురం, భూపాలపల్లి, మల్హర్‌రావు మండలాల్లో చేపడుతున్న భూసేకరణపై సమీక్షించారు. ఇప్పటివరకు జరిగిన, ఇంకా మిగిలి ఉన్న భూసేకరణ గురించి జెన్‌కో సీఈ సిద్ధయ్య, ఆర్డీవో శ్రీనివా్‌సను అడిగి తెలుసుకున్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఎవరికీ అన్యాయం జరుగకుండా చట్టప్రకారం నష్టపరిహారం, పునరావాసం కల్పిస్తామన్నారు. ఓపెన్‌కాస్టు గనుల బ్లాసింగ్‌లతో ఇబ్బందులకు గురవుతున్న తాడిచర్ల గ్రామంలో అవసరమైన భూమిని సేకరించేందుకు సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ దివాకర, జెన్‌కో ఎస్‌ఈ తిరుపతయ్య, ఈఈ తిరుపతిగౌడ్‌, తహసీల్ధార్‌ సతీష్‌, ఇక్భాల్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-27T05:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising