ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్‌ పాలనకు చరమగీతం పాడాలి: షర్మిల

ABN, First Publish Date - 2021-11-04T02:29:48+05:30

ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత పాలనకు చరమగీతం పాడాలని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతపల్లి: ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత పాలనకు చరమగీతం పాడాలని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల పిలుపునిచ్చారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర భాగంగా నిర్వహిస్తున్న మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల మాట్లాడుతూ గత ఎన్నికలకు ముందు నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌, ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించాడని దుయ్యబట్టారు. గత ఏడు సంవత్సరాల పాలనలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినా కేసీఆర్‌కు చలనం లేదని తప్పుబట్టారు. కొట్లాడి సాధించుకున్న రాజ్యంలో పాలన ఆశించిన విధంగా లేదన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీ అవసరమని షర్మిల అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో కేవలం మూడు వేల మంది వరకే రూ.25వేల వరకు రుణమాఫీ చేసి 36 లక్షల మంది రైతులకు మొండి చెయ్యి చూపారని మండిపడ్డారు. రైతులకు పంట పండించే హక్కులేనప్పుడు పొలాలు ఉండి ఏం లాభమని షర్మిల ప్రశ్నించారు.

Updated Date - 2021-11-04T02:29:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising