ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షర్మిల పార్టీకి మరో కీలక నేత గుడ్‌బై

ABN, First Publish Date - 2021-09-05T21:02:23+05:30

వైఎస్‌ఆర్‌టీపీ వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఆరంభంలోనే ఆ పార్టీకి ఊహించన షాక్‌లు తగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: వైఎస్‌ఆర్‌టీపీకి వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఆరంభంలోనే ఆ పార్టీకి ఊహించని షాక్‌లు తగుతున్నాయి. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తెస్తామని ప్రతిన బూనిన ఆ పార్టీ అధినేత్రి షర్మిలకు ఆ పార్టీ నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ పటిష్టం చేసుకునేందుకు నిర్మాణాలను బలపర్చుకుంటున్నారు. ఇప్పటికే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కన్వీనర్లను కూడా నియమించారు. అయితే ఈ రోజు మహబూబ్‌నగర్ పార్లమెంట్ కన్వీనర్ పదవికి ఇబ్రహీం రాజీనామా చేశారు. పార్టీలో ప్రధాన్యత ఇవ్వకపోవడంతోనే ఆయన రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇటీవల వైఎస్‌ఆర్‌టీపీలో కీలక నేత ఉన్న ఇందిరా శోభన్ ఆ పార్టీ రాజీనామా చేసి కలకలం రేపారు. వైఎస్‌ఆర్‌టీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. అభిమానులు, తెలంగాణ ప్రజల కోరిక మేరకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. గతంలో వైఎస్సార్‌టీపీకి చేవెళ్ల ప్రతాప్‌రెడ్డి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నేత రాఘవ రెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇలా రెండు నెలల వ్యవధిలోనే ఆ పార్టీకి ముగ్గురు కీలక నేతలు రాజీనామా చేశారు. ఆ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోందని అందువల్ల నేతలు రాజీనామా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2021-09-05T21:02:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising