ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధాకరం: హైకోర్టు

ABN, First Publish Date - 2021-04-29T21:23:07+05:30

రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధాకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మున్సిపల్‌ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు అత్యంత బాధాకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మున్సిపల్‌ ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపారు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఎస్ఈని కోర్టు ఆదేశించింది. ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని, మద్యం దుకాణాలు మూసి వేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్  విచారణకు హాజరైనారు. ఎన్నికల విధుల్లో 2,557 పోలీసులు, 7,695 మంది ఉద్యోగులను నియమించామని ఎస్‌ఈసీ కోర్టుకు తెలిపింది. 


‘‘కరోనా విపత్తులో వాయిదా వేయకుండా ముందుకెళ్లడం బాధాకరం. గతంలో హైదరాబాద్ మేయర్ స్థానం ఏడాదిన్నర ఖాళీగా ఉంది కదా? ప్రజలు, ఉద్యోగుల ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నికల నిర్వహిస్తున్నారు. ఉద్యోగులకు చేస్తారా? చస్తారా అనే పరిస్థితి కల్పించారు. ప్రపంచమంతా కరోనాతో యుద్ధం చేస్తుంటే ఎస్‌ఈసీ దృష్టి ఎన్నికలపై ఉంది. ఎస్ఈసీ అధికారులు అంగారక గ్రహంపై ఉన్నారేమో. ప్రభుత్వం కూడా ఎన్నికలకు సన్నద్ధత వ్యక్తం చేయడం ఆశ్చర్యం’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

Updated Date - 2021-04-29T21:23:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising