ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి యథావిధిగా పాఠశాలలు

ABN, First Publish Date - 2021-08-31T23:53:41+05:30

రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను మినహయించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు, వసతి గృహాలను మినహయించి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను యథావిధిగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి పి.సబితా‌ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సబితా మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు తప్పనిసరి కాదని, తల్లిదండ్రులను విద్యార్థుల హాజరుపై పాఠశాలల యాజమాన్యాలు వత్తిడి చేయకూడదని మంత్రి సూచించారు. తరగతులను ప్రత్యక్ష పద్ధతి, ఆన్‌లైన్ ద్వారా గాని నిర్వహించే అవకాశం స్కూల్ మేనేజ్‌మెంట్లే నిర్ణయించుకోవచ్చని మంత్రి తెలిపారు. విద్యార్థుల నుంచి ఎలాంటి సమ్మతి పత్రాలను కోరవద్దని స్కూల్ మేనేజ్‌మెంట్లను మంత్రి కోరారు . ఇప్పటికే జారీ చేసిన కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకొని పాఠశాలల నిర్వహణ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పి.సబితా‌ఇంద్రారెడ్డి ఆదేశించారు.

Updated Date - 2021-08-31T23:53:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising