ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’

ABN, First Publish Date - 2021-02-02T04:23:56+05:30

‘ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి’

వర్ధన్నపేటలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాసంఘాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వర్ధన్నపేట, ఫిబ్రవరి 1 : దళిత వర్గాలను కించ పరిచేలా వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్‌ ఎస్సీసెల్‌ రాష్ట్ర కన్వీనర్‌ నరుకుడు వెంకటయ్య, ఎమ్మార్పీఎస్‌ జిల్లా కార్యదర్శి ఈరెల్లి శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకుడు శ్రీకాంత్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం వర్ధన్నపేట అంబేద్కర్‌ సెంటర్‌లో ధర్మారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు మరుపట్ల అంజయయ్య, బెజ్జం శివ, బెజ్జం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

దామెర: హన్మకొండలో ఆదివారం జరిగిన ఓసీ మహాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా మాట్లాడిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి క్షమాపణ చెప్పాలని ఎంఎస్‌ఎఫ్‌ వరంగల్‌ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లెల్ల మురళీ మాదిగ డిమాండ్‌ చేశారు. సోమవారం సింగరాజుపల్లిలో ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశంలో మాట్లాడారు. ‘ఆఫీసర్లకు.. అక్షరం ముక్క రాదు.. పని రాదు..’ అంటూ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో ఒడ్డెపల్లి మధు, గోవిందు రాజీవ్‌, నల్ల పుష్ఫకుమార్‌, ఒడ్డెపల్లి శ్రీకాంత్‌, కిరణ్‌, రాకేష్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-02T04:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising