ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్.. ముఠా గుట్టు రట్టు

ABN, First Publish Date - 2021-12-03T03:03:29+05:30

హైదరాబాద్: ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఈ కాల్ సెంటర్ దందా చేస్తూ దేశ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు మోసం చేసింది ఈ ముఠా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ఎస్‌బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును  సైబరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఈ కాల్ సెంటర్ దందా చేస్తూ దేశ వ్యాప్తంగా వందల కోట్ల రూపాయలు మోసం చేసింది ఈ ముఠా. క్రిడెట్ కార్డు లిమిట్ పెంచుతున్నామంటూ మభ్య పెట్టి ఓటీపీల ద్వారా మోసాలకు తెర లేపారు. దేశ వ్యాప్తంగా 32 వేల కాల్స్ చేసినట్లు విచారణలో తేలింది. ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 14 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఈ ముఠాపై  209 కేసులు ఉన్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 14 కేసుకు నమోదు చేశారు పోలీసులు. ప్రధాన నిందితుడు నిఖిల్ మాదాన్ ఆధ్వర్యంలో ఈ కాల్ సెంటర్ నడుస్తుందని విచారణలో తేలింది.  క్రెడిట్ కార్డ్ హోల్డర్స్ డేటా సేకరించి, వారి క్రెడిట్ కార్డ్ లిమిట్స్ పెంచుతామని చెప్పి మోసం చేస్తున్నారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. థర్డ్ పార్టీ ఏజెన్సీల ద్వారా సమాచారాన్ని తీసుకుని నకిలీ కాల్ సెంటర్ ద్వారా ఈ కాల్స్ చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాంకింగ్ సెక్టార్‌లో వీరికి బాగా అనుభవం ఉండడంతో వీరు ఈ సైబర్ నేరాలు ఈజీగా చేయగలుగుతున్నారని తెలిపారు. 

Updated Date - 2021-12-03T03:03:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising