ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెలుగులోకి వస్తున్న సంధ్య కన్వెన్షన్ ఎండీ మోసాలు

ABN, First Publish Date - 2021-11-11T01:31:17+05:30

నగరంలోని సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు చేసిన మోసాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నగరంలోని సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు చేసిన మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. బిల్డర్స్, వ్యాపారవేత్తలను మోసం చేసినట్టుగా శ్రీధర్‌రావుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ట్రస్ట్ పేరుతో కొందరిని శ్రీధర్‌రావు మోసగించాడు. ముంబైకి చెందిన ప్రముఖ బిల్డర్‌ని శ్రీధర్‌రావు మోసం చేసాడు. ప్రముఖ బిల్డర్ నుంచి భవనం కొని డబ్బులు ఇవ్వకుండా శ్రీధర్‌రావు ఎగ్గొట్టాడు. డబ్బుల కోసం శ్రీధర్‌రావు చుట్టూ ముంబైకి చెందిన బిల్డర్స్ తిరిగారు.  దాదాపు రూ.300 కోట్ల వరకు శ్రీధర్‌రావు మోసం చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.


శ్రీధర్‌రావును కేసుల నుంచి తప్పించేందుకు అదనపు ఎస్పీ యత్నాలు చేసారు. శ్రీధర్‌రావు కోసం నిన్న హైకోర్టులో అదనపు ఎస్పీ తీవ్ర ప్రయత్నాలు చేసాడు. రాయదుర్గం కేసు నుంచి తప్పించేందుకు అదనపు ఎస్పీ తీవ్ర ప్రయత్నించాడు. ఉన్నతాధికారులకు సమాచారం తెలియడంతో అదనపు ఎస్పీని అధికారులు మందలించారు. అదనపు ఎస్పీపై చర్యలకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసారు. 




 నగరంలోని సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శ్రీధర్‌రావుని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసారు. ఓ భవన నిర్మాణంలో పలువురిని శ్రీధర్‌రావు మోసం చేసాడు. దీంతో శ్రీధర్‌రావుపై రాయదుర్గం పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసారు. భవన అమ్మకాల విషయంలో కొనుగోలుదారులను శ్రీధర్  మోసగించాడు. భారీగా నగదును వసూలు చేసి కొనుగోలుదారులను శ్రీధర్ మోసం చేసాడు. 

Updated Date - 2021-11-11T01:31:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising