ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించండి: సంయుక్త కమిటీ

ABN, First Publish Date - 2021-10-01T17:58:19+05:30

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త కమిటీ ఎన్జీటీకి నివేదిక సమర్పించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై పరిశీలనకు ఏర్పాటైన సంయుక్త కమిటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక సమర్పించింది. ఈ ప్రాజెక్టు సాగునీటి ప్రాజెక్టుగా పనులు చేపట్టారని సంయుక్త కమిటీ ధృవీకరించింది. తప్పుడు నివేదిక అందించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి జరిమానా విధించాలని కమిటీ సిఫార్సు చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ. 3 కోట్ల 70 లక్షల జరిమానా చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని సిఫార్స్ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే అన్ని పనులు చేపట్టిందని కమిటీ తేల్చింది.


గతంలో పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు లేకుండానే తెలంగాణ ప్రభుత్వం సాగునీటి పనులు చేపట్టిందని ఏపీ ప్రభుత్వం, రైతులు ఎన్జీటీని ఆశ్రయించారు. దీనిపై నిజనిర్ధారణ కోసం ఎన్జీటీ సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి నివేదికను ఎన్జీటీకి అందజేసింది. ఈ ప్రాజెక్టు పనుల్లో పర్యావరణ ఉల్లంఘనలు చాలా జరిగాయని, పర్యావరణ పరిహారం కోసం రూ. 3.7 కోట్లు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ సంయుక్త కమిటీ నివేదికలో స్పష్టం చేసింది.

Updated Date - 2021-10-01T17:58:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising