ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీళ్లు, నిధులు, నియామకాలు సెంటిమెంట్‌లో పడొద్దు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ABN, First Publish Date - 2021-11-28T17:38:28+05:30

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కలిసి తెలంగాణలో చదువు రాకుండా చేస్తున్నారని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పాలకులు మనకు విద్యను రానివ్వడం లేదన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ కలిసి తెలంగాణలో చదువు రాకుండా చేస్తున్నారని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పాలకులు మనకు విద్యను రానివ్వడం లేదన్నారు. గురుకులాలకు బడ్జెట్ ఏ ఇవ్వలేదని... తనను ఎన్నో కష్టాలు పెట్టారని.. భిక్షంలా వేశారని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణలో మెడకాయ మీద తలకాయ ఉన్న సీఎం అయితే.. విద్యకు ప్రాముఖ్యత ఇవ్వాలి. కేసీఆర్ ఒక్క యూనివర్సిటీకైనా వెళ్లారా? కనీసం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారా? బహుజనులను ఎదగకుండా చేయాలని పాలకులు భావిస్తున్నారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు నాలుగేళ్ల పాటు 2,744 కోట్లు కేటాయిస్తే.. 7 కోట్లు విడుదల చేశారు. ఇది ఎవరికైనా తెలుసా? పదవులు ఇస్తే సరిపోతుందా..? అసలు సంపద ఎక్కడుంది..? పదవులు ఎక్కడ ఇస్తున్నావు? సామాజిక రాజకీయంపై అవగాహన ఉండాలి. నీళ్లు, నిధులు, నియామకాలు, కేంద్రం సెంటిమెంట్‌లో పడొద్దు. ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. బహుజన రాజ్యం గురించి ఎంత మంది కుటుంబ సభ్యులకు చెప్పారు? ఓటుకు ఆరు వేలు, దళిత బంధుకు రూ.10 లక్షలు అంటూ డబ్బు మత్తులో కొట్టుకుపోతే బహుజన రాజ్యం రాదు. ఃః


అందరిలో చైతన్యం రావాలి. ఈ రోజు నుంచే బహుజన రాజ్యం కోసం పని చేయాలి. ప్రజలకు ఎల్లమ్మ, పోచమ్మ గుడులు కట్టించి ఓట్లు వేయించుకుంటున్నారు. 25% ముదిరాజ్, 14% యాదవ్.. అయినప్పటికీ 3% ఉన్న రెడ్డీలు నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఏలుతున్నారు. దాదాపుగా రాష్ట్రం, దేశం పరిస్థితి ఇదే. డిజిటల్ మీడియాలో నేర్చుకున్న నైతికతను కుటుంబాలు, మన సమాజంతో షేర్ చేసుకోవాలి. ఎన్నికల ముందు వచ్చి భుజం మీద చెయ్యి వేసి ఇంట్లో భోజనం చేస్తే కరిగిపోవద్దు. బహుజన రాజ్యం వస్తేనే మన స్థితిగతులు మారతాయి. ముస్సోలిని నుంచి మోదీ, కేసీఆర్ వరకూ కరుడుగట్టిన నియంతలు. వీళ్లు రాజ్యాంగ, ప్రజాస్వామ్య సంస్థలను పని చేయనివ్వరు. మనకు జరుగుతున్న తరతరాల అన్యాయం తెలియాలంటే చదవాలి, అధ్యయనం చేయాలి’’ అని పేర్కొన్నారు.

Updated Date - 2021-11-28T17:38:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising