ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులకు లోక్‌సభ నియోజకవర్గాల బాధ్యతలు

ABN, First Publish Date - 2021-08-04T08:48:15+05:30

పార్టీ కార్యక్రమాలు, ఇతర అంశాలను సమన్వయం చేసుకునేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం బాధ్యతలు అప్పగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అనుబంధ సంఘాల కార్యక్రమాలూ పర్యవేక్షించాలి: రేవంత్‌ 


హైదరాబాద్‌, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): పార్టీ కార్యక్రమాలు, ఇతర అంశాలను సమన్వయం చేసుకునేందుకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మంగళవారం బాధ్యతలు అప్పగించారు. వాళ్లు తమకు కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గాలు, అనుబంధ సంఘాల కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. గీతారెడ్డికి హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గాలు, ఎన్‌ఎ్‌సయూఐ, ఇంటలెక్చువల్‌ సెల్‌, రీసెర్చ్‌ డిపార్ట్‌మెంట్‌, ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు.


అంజన్‌కుమార్‌ యాదవ్‌కు నిజామాబాద్‌, మహబూబాబాద్‌, మెదక్‌, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాలు, యూత్‌ కాంగ్రెస్‌, మైనార్టీ, ఫిషర్‌మెన్‌ డిపార్ట్‌మెంట్లు కేటాయించారు. జగ్గారెడ్డికి ఖమ్మం, వరంగల్‌, భువనగిరి, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాలు, మహిళా కాంగ్రెస్‌, ఐఎన్‌టీయూసీ, కార్మిక, అసంఘటిత కార్మిక విభాగాలను పర్యవేక్షించే బాధ్యత అప్పగించారు. అజారుద్దీన్‌కు ఆదిలాబాద్‌, జహీరాబాద్‌, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలు, సోషల్‌ మీడియా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. మహే్‌షకుమార్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూలు, చేవెళ్ల లోక్‌సభ స్థానాలను, అనుబంధ సంఘాలు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విభాలనూ సమన్వయం చేసుకునే బాధ్యత అప్పగించారు. కిసాన్‌, ఖేత్‌ కాంగ్రెస్‌, ఎన్నారై సెల్‌ సహా కార్యనిర్వాహక అధ్యక్షులకు కేటాయించని అనుబంధ సంఘాలు, డిపార్ట్‌మెంట్లు రేవంత్‌రెడ్డి పరిధిలోనే ఉంటాయి. 


ఈటల డ్రామా సరే.. కేసీఆర్‌ డ్రామా మాటేంటి?: నిరంజన్‌ 

 ‘‘వీల్‌చైల్‌తో ఈటల ఎన్నికల డ్రామా సరే..! హుజూరాబాద్‌ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని దళితబంధు పేరుతో సీఎం కేఈఆర్‌ చేస్తున్న డ్రామా మాటేంటి?’’ అని మంత్రి హరీశ్‌రావును టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి. నిరంజన్‌ ప్రశ్నించారు. ప్రజల్ని మోసం చేసే నాటకాలు ఆడటంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ రెండూ రెండేనన్నారు. కాగా, మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని అఖిలభారత మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సుశ్మిత దేవ్‌ మంగళవారం ప్రకటించారు. 14 మంది ఉపాధ్యక్షులు, 13 మంది ప్రధాన కార్యదర్శులు, 12 మంది కార్యదర్శు లతో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. 21 జిల్లాలకు మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులనూ నియమించారు.

Updated Date - 2021-08-04T08:48:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising