ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసీఆర్ హుస్సేన్ సాగర్‌లో దూకాలి... మోదీ ఎర్రకోట మీద నుంచి దూకాలి : రేవంత్

ABN, First Publish Date - 2021-04-23T20:52:21+05:30

కరోనా వ్యాప్తిపై నిపుణులు సూచనలు చేస్తే ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పెడ చెవిన పెట్టారని కాంగ్రెస్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: కరోనా వ్యాప్తిపై నిపుణులు సూచనలు చేస్తే ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పెడ చెవిన పెట్టారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చడం మీద మోదీ దృష్టి నిలిపితే, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల మీద దృష్టి నిలిపారని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో మాట్లాడారు. కరోనా విషయంలో హైకోర్టు తిట్లకు సీఎం కేసీఆర్ హుస్సేన్ సాగర్లో దూకాలని, సుప్రీం తిట్టిన తిట్లకు ఎర్రకోట మీద నుంచి దూకాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈటల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి గౌరవం కాపాడుకోవాలన సూచించారు. ఆయన శాఖలోని అధికారులే ఆయన్ను గౌరవించడం లేదని రేవంత్ ఆరోపించారు. హెటేరో డ్రగ్స్ యజమానులు మందులను బ్లాక్‌లో విక్రయిస్తున్నారని, అయినా వారిపై చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు.


 హెటెరో డ్రగ్స్ యజమానులు, మంత్రి కేటీఆర్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపార భాగస్వామ్యం ఉందని, అందుకే చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ ఫైరయ్యారు. భారత్‌లో తయారైన వ్యాక్సిన్‌ను దాయాది పాక్‌లో ఉచితంగా వేశారని, భారత్‌లో కూడా అందరికీ ఉచితంగానే వ్యాక్సిన్‌ను వేయాలని డిమాండ్ చేశారు. జాతీయ విపత్తు చట్టం కింద వ్యాక్సిన్, ఆక్సిజన్‌ను తయారు చేసే కంపెనీలను కేంద్రం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ నిర్లక్ష్యం వల్లే వ్యాక్సిన్, ఆక్సిజన్ దేశంలో అందుబాటులో లేకుండా పోయాయని విమర్శించారు. భారత్‌లోనే వ్యాక్సిన్ తయారు చేసినా, కొరతగానే ఉందని, వ్యాక్సిన్ ధరను 600 రూపాయలుగా నిర్ణయించడం అంటే ప్రజలను దోచుకోవడమేనని ధ్వజమెత్తారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలను, హాస్పటల్స్‌ను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని, కరోనా వైద్యం అందించాలని రేవంత్ కోరారు. 

Updated Date - 2021-04-23T20:52:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising