‘ధరణి’పై 4 వారాల్లో నివేదిక ఇవ్వండి
ABN, First Publish Date - 2021-10-21T10:11:30+05:30
ధరణి పోర్టల్‌పై పూర్తి వివరాలతో కూడిన నివేదికను నాలుగు వారాల్లో అందించాలని..
సీఎస్ సోమేశ్‌ను ఆదేశించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ
హైదరాబాద్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): ధరణి పోర్టల్‌పై పూర్తి వివరాలతో కూడిన నివేదికను నాలుగు వారాల్లో అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్‌ఆర్‌సీ) ఆదేశించింది. ధరణిలో సమస్యలతో తెలంగాణ వ్యాప్తంగా రైతు లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఇటీవల ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. ధరణి వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. దీంతో ధరణిలో సమస్యల పరిష్కారం కోసం తీసుకున్న చర్యలు, పోర్టల్ అమలుపై సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎ్‌సను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది.
Updated Date - 2021-10-21T10:11:30+05:30 IST