ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిలిండర్‌కు దండం పెట్టు.. బీజేపీని బొంద పెట్టు

ABN, First Publish Date - 2021-10-19T07:23:55+05:30

మహిళలందరూ ఈ నెల 30న ఓటు వేసేందుకు వెళ్లే ముందు సిలిండర్‌కు దండం పెట్టి.. బీజేపీని బొంద పెట్టాలని మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఉగాది లోపు రూ. లక్ష రుణమాఫీ చేస్తాం
  • త్వరలో 70 వేల ఉద్యోగాల భర్తీ: హరీశ్‌రావు


హుజూరాబాద్‌, అక్టోబరు 18: మహిళలందరూ ఈ నెల 30న ఓటు వేసేందుకు వెళ్లే ముందు సిలిండర్‌కు దండం పెట్టి.. బీజేపీని బొంద పెట్టాలని మంత్రి  హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని కనుకులగిద్దె, జూపాక, బొత్తలపల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈటల రాజేందర్‌ తన స్వార్థం కోసం రాజీనామా చేశారని విమర్శించారు. ఉగాది లోపు రైతుల లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తామని, రానున్న రోజుల్లో 70 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ 21 రోజుల్లో 16 సార్లు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచడం వల్ల నిత్యావసరాల ధరలు పెరిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని దళితులందరికీ దళితబంధు పథకం వస్తుందని, ఎవరూ అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. కనుకులగిద్దె గ్రామంలో ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్‌రావు నేలపై కూర్చుని మహిళలతో ముచ్చటించారు. పింఛన్లు, రేషన్‌ బియ్యం వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివా్‌సయాదవ్‌కు పార్టీ ఎన్నారై శాఖల మద్దతు ఉంటుందని పలు దేశాలకు చెందిన ప్రతినిధులు పేర్కొన్నారు. 50 దేశాల్లో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎన్పారై శాఖల కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన విడియో కాన్ఫరెన్సు.లో పలువురు పాల్గొని ప్రసంగించారు.

Updated Date - 2021-10-19T07:23:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising