ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

42 రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు పట్టివేత

ABN, First Publish Date - 2021-05-11T06:30:07+05:30

42 రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు పట్టివేత

వివరాలను వెల్లడిస్తున్న డీసీపీ వెంకటలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ అర్బన్‌ క్రైం, మే 10 : వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పెద్దఎత్తున రెమ్‌డిసివిర్‌ ఇంజక్షన్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాను వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 42 ఇంజక్షన్లు రూ. 69 వేల నగదును స్వాధీనం చేసుకు న్నారు. సీపీ కార్యాలయంలో వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ వెంకటలక్ష్మి సోమ వారం విలేకరులకు వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌ బోడుప్పల్‌కు చెందిన చందా విజయ్‌కుమార్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లా దామెర మండలం ఊరుగొండకు చెందిన చింతం రాజేశ్‌, హన్మకొండకు చెందిన ముందాటి రాజే శ్‌, గీసుగొండ మండలం ధర్మారానికి చెందిన గట్టు అవినాశ్‌, హన్మకొండకు చెందిన వావిలాల సురేష్‌ ముఠాగా ఏర్పడి రెమ్‌డిసివిర్‌ హైదరాబాద్‌ నుంచి ఎమ్మార్పీ రేట్లకు కొనుగోలు చేసి వరంగల్‌లో అధిక ధరలకు విక్రయిస్తు న్నారు. ఈ సమాచారాన్ని అవినీతి నిరోధక స్వచ్ఛంద సంస్థ గుర్తించి పోలీ సులకు చేరవేయగా అప్రమత్తమైన పోలీసులు అక్రమార్కులపై  నిఘా పె ట్టారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం కట్టమల్లన్న దేవాలయం వద్ద ఓ కరోనా బాధితుడికి రెమ్‌డిసివిర్‌ను ఇస్తున్నట్లు తెలుసుకున్న పోలీసు లు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. హైదరాబాద్‌ శంషాబాద్‌ నుంచి ఇంజక్షన్లు తెచ్చి ఇక్కడ రూ. 28వేలకు విక్రయిస్తున్నట్లు విచారణలో వారు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 42 రెమ్‌డిసివర్‌ ఇంజక్షన్లు రూ. 69 వేల న గదును స్వాధీనం చేసుకున్నామని డీసీపీ వెల్లడించారు. వీరిని పట్టుకునేందు కు సహకరించిన మామునూరు ఏసీపీ నరేష్‌కుమార్‌, గీసుగొండ సీఐ వెం కటేశ్వర్లు, ఎస్‌ఐ అబబ్దుల్‌ రహీం, కానిస్టేబుళ్లు రాజు, పవన్‌కుమార్‌, కిషన్‌ను డీసీపీ వెంకటలక్ష్మి అభినందించారు.

Updated Date - 2021-05-11T06:30:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising