ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘రెమ్‌డెసివిర్‌’ బ్లాక్‌మార్కెట్‌ దందా ముఠా అరెస్టు

ABN, First Publish Date - 2021-05-07T06:48:33+05:30

‘రెమ్‌డెసివిర్‌’ బ్లాక్‌మార్కెట్‌ దందా ముఠా అరెస్టు

నిందితులను అరెస్టును చూపుతున్న సీపీ తరుణ్‌ జోషి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్‌ అర్బన్‌ క్రైం, మే 6: కరోనా రోగులకు సమయాల్లో అందించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు బ్లాక్‌మార్కెట్‌లో విక్రయిస్తున్న ముఠాను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌, సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 28 రెమ్‌డెసివిర్‌ బుడ్లు, రూ. 20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి గురువారం తన కార్యాలయంలో నిందితుల అరెస్టు చూపి కేసు వివరాలను వెల్లడించారు. 

వరంగల్‌ మండిబజార్‌కు చెందిన బాగాజీ మనోహర్‌, హన్మకొండ భీమారానికి చెందిన కొలిపాక కుమారస్వామి, కరీమాబాద్‌కు చెందిన ఐత అశోక్‌ వివిధ కంపెనీల్లో మెడికల్‌ రిప్రజెంటీ్‌సగా పనిచేసున్నారు. వీరు వరంగల్‌లోని ఓ మెడికల్‌ పాపులో కరోనా రోగులకు ఎంఆర్‌పీకి అమ్మాల్సిన ఇంజక్షన్లను ఎక్కువ ధరలకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఒక డోసు రూ.3,490 విక్రయించాల్సి ఉండగా రూ.28వేలకు.. కొన్ని సందర్భాల్లో రూ.30 నుంచి 40 వేలకు కూడా అమ్ముతున్నారు. పోలీసులకు పక్కా సమాచారం అందడంతో గురువారం ముగ్గురిని అరెస్టు చేశారు. వారి నుంచి 28ఇంజక్షన్లతో పాటు రూ.20వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వారిలో సెంట్రల్‌ జోన్‌ ఇన్‌చార్జి డీసీపీ పుష్ప, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ప్రతా్‌పకుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివా్‌సజీ, సుబేదారి సీఐ రాఘవేందర్‌, ఎస్సై సాంబమూర్తి, టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది సోమలింగం, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, మహేందర్‌, అలీ, రాజేశ్‌, సృజన్‌, మీర్‌ మహ్మద్‌, శ్రీనివాస్‌, రాజు, చిరంజీవిని సీపీ అభినందించారు.

హన్మకొండ కొత్తబ్‌సస్టేషన్‌ వద్ద..

హన్మకొండ కొత్తబస్టాండ్‌ సమీపంలో ఐదుగురు వ్యక్తులు రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను హన్మకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు స్టేషన్‌ ఆవరణలో సీఐ చంద్రశేఖర్‌ గురువారం నిందితుల వివరాలను వెల్లడించారు. కుమార్‌, మధూకర్‌, వినయ్‌కుమార్‌, నవీన్‌, సందీ్‌పలు అనుమానాస్పదంగా కొత్తబ్‌సస్టేషన్‌ సమీపంలో తిరుగుతున్నట్టు పక్కా సమాచారం అందింది. తమ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోగా వారి వద్ద కొవిడ్‌ రోగులకు అందించే రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కనిపించాయి. వారిని విచారించగా ఓ మెడికల్‌ స్టోర్‌లో తక్కువ ధరకు కొనుగోలు చేసి బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. వీరి నుంచి ఐదు ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వెల్లడించారు. వీరిని పట్టుకోవడానికి సహకరించిన కానిస్టేబుల్‌ బావ్‌సింగ్‌, రాజును సీఐ అభినందించారు.

Updated Date - 2021-05-07T06:48:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising