ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హన్మంతాపూర్‌లో ఇనుము తయారీ కేంద్రం ఆనవాళ్లు

ABN, First Publish Date - 2021-12-31T19:42:00+05:30

బృహత్‌ శిలాయుగం నాటి ఇనుము తయారీ చేసి న ప్రాంతాలు జనగామ జిల్లాలో అనేకం ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి 

నర్మెట, డిసెంబరు 30 : బృహత్‌ శిలాయుగం నాటి ఇనుము తయారీ చేసి న ప్రాంతాలు జనగామ జిల్లాలో అనేకం ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. జనగామ జిల్లా నర్మెట మండలంలోని హన్మంతాపూర్‌లోని చిట్యాలగడ్డను గురువారం పరిశోధించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ భారీ ఇనుము సంగ్రహ కేంద్రం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించామన్నారు. గ్రామం మొదట్లోనే డప్పోని ఒర్రేఒడ్డున 6 నుంచి 8 అడుగుల లోతు ప్రాంతంలో ఇనుము సంగ్రహ కేంద్రం ఉన్నట్లు చెప్పారు. తెలంగాణలో పెద్ద ఇనుము కేంద్రాలలో ఇదొకటన్నారు. హన్మంతాపూర్‌తో పాటు వెల్దండ, బొమ్మకూరు జనగామ మండలంలోని అడవి కేశ్వాపూర్‌లలో ఇనుము తయారు చేసి న దాఖలాలు ఉన్నాయన్నారు.


ఇక్కడి ముడిరాయి నుంచి ఇనుము సంగ్రహించేదని హన్మంతాపూర్‌ గ్రామస్థుడు నాగంసల్లి అంజయ్య వివరించినట్లు తెలిపారు. గ్రామంలోని చిట్టెపు రాళ్లగడ్డకు కొద్ది దూరంలో రెండు వలయాలు ఉన్న రాకాసిగూళ్లు, నిలువురాయితో కూడిన ఆది మానవుల శ్మశాన వాటిక ఉందన్నారు. నవీన శిలాయుగం నాటిరాతి పనిముట్ల.. పరిశ్రమకు చెందిన ఆధారాలు ఉన్నాయన్నారు. నాలుగు వేలఏళ్ల కిందటి పురాతన సమాజం యొక్క నాగరికతను అధ్యయనం చేయడానికి అతిముఖ్యమైన చారిత్రక ఆధారాలు ఇనుముతోపాటు ఈ చిట్టపురాళ్ల గడ్డలే పేర్కోన్నారు. భవిష్యత్‌ తరాల కోసం, తూలనాత్మక అధ్యయనం కోసం పురావస్తు శాఖ వీటిని పరిరక్షించాలని రత్నాకర్‌రెడ్డి వివరించారు. 

Updated Date - 2021-12-31T19:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising