ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మలుపులు తిరుగుతున్న రసమయి కాలువ తవ్వకం వివాదం

ABN, First Publish Date - 2021-01-17T15:50:43+05:30

రసమయి బాలకిషన్ తన ఫామ్ హౌస్ కోసం అక్రమంగా కాలువ తవ్వించుకున్నారంటూ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిద్ధిపేట: జిల్లాలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తన ఫామ్ హౌస్ కోసం అక్రమంగా కాలువ తవ్వించుకున్నారంటూ వచ్చిన ఆరోపణలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఆ కాలువ రసమయి పొలాల కోసం కాదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతపై టీఆర్ఎస్ నేతలు దౌర్జన్యం  చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు.


సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం, గుండారం గ్రామంలో మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌కు పొలాలు ఉన్నాయి. ఆయన వాటిని ఫామ్ హౌస్‌లా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇటీవల ఆ పొలాల గుండా అధికారులు కాలువను నిర్మిస్తున్నారు. ఇది అక్రమంగా నిర్మిస్తున్నారని, రసమయి ఫామ్ కోసమే నిర్మిస్తున్నారని కాంగ్రెస్ నేత పోతి రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు చేస్తు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అది వైరల్ కావడంతో అధికారులు వివరణ ఇచ్చారు. కాలువ కోసం రసమయి తన పొలం ఇచ్చారని చెప్పారు. ఇతర రైతులు కూడా అదే విషయం చెప్పారు. రేపాక గ్రామ పరిధిలో 2 వందల ఎకరాలకు సాగునీరు ఇవ్వడానికి కాలువ నిర్మిస్తున్నామని, ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదని అధికారులు చెప్పారు.

Updated Date - 2021-01-17T15:50:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising