ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేప్‌ నాటకం యువతిపై చర్యలు!

ABN, First Publish Date - 2021-02-15T08:19:14+05:30

కిడ్నాప్‌, రేప్‌ పేరుతో రోజుకో కథ చెప్పి.. ముచ్చెమటలు పట్టించిన బీ-ఫార్మసీ విద్యార్థినిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. చట్టాలను అడ్డుపెట్టుకుని, వ్యవస్థనే ఓ ఆట ఆడించిన ఆ యువతిపై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోషల్‌ మీడియాలో వైరల్‌గా ‘డ్రామా’

మూడు రోజులు ఆటోవాలాలకు నరకం?


హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): కిడ్నాప్‌, రేప్‌ పేరుతో రోజుకో కథ చెప్పి.. ముచ్చెమటలు పట్టించిన బీ-ఫార్మసీ విద్యార్థినిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. చట్టాలను అడ్డుపెట్టుకుని, వ్యవస్థనే ఓ ఆట ఆడించిన ఆ యువతిపై న్యాయపరంగా కేసు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ముఖ్యంగా.. ఈ కిడ్నాప్‌ డ్రామా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆ యువతి తీరుపై ఆగ్రహావేశాలు, తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆటో యూనియన్లు కూడా.. కరోనా లాక్‌డౌన్‌తో ఉపాధి లేక.. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా నిలదొక్కుకుంటున్న అభం శుభం తెలియని ఐదుగురు ఆటో డ్రైవర్లను ఇబ్బందికి గురిచేసిన సదరు యువతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి.


ఇంటరాగేషన్‌లో ఓ ఆటోడ్రైవర్‌ మానసికంగా కృంగిపోయి.. తానే నేరం చేశానని ఒప్పుకొన్నట్లు సమాచారం. అయితే.. సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేసిన బృందం, అతను చెబుతున్న వివరాలకు పొంతన లేకపోవడంతో యువతిపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉన్నతాధికారులకు ఇదే విషయాన్ని తెలపడంతోపాటు ఘటన జరిగిన సమయంలో సదరు ఆటోడ్రైవర్‌ నారపల్లి సమీపంలోని ఓ మల్టిప్లెక్స్‌కు, ఆ తర్వాత ఓ బార్‌కు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిర్ధారించుకున్నారు. దీంతో.. ఆ యువతి రాంపల్లి చౌరస్తా నుంచి ఎక్కడికి వెళ్లింది? అనే కోణంలో 120 సీసీటీవీలను జల్లెడ పట్టారు. ఆమె నాటకమాడుతోందని నిగ్గుతేల్చారు.

Updated Date - 2021-02-15T08:19:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising