పురుగుల మందుతాగి యువతి ఆత్మహత్య
ABN, First Publish Date - 2021-10-22T05:22:43+05:30
పురుగుల మందుతాగి యువతి ఆత్మహత్య
దోమ: కడుపునొప్పి భరించలేక ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండలంలోని ఐనాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సంగిని నర్సింహులు, ఎల్లమ్మల కూతురు అంజమ్మ(17) కులకచర్ల మండలం కేజీబీవీ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. గత కొద్దిరోజులుగా అంజమ్మ కడుపునొప్పితో బాధపడుతోంది.ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లోనే క్రిమిసంహార మందుతాగింది. గమనించిన కుటుంబసభ్యులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో మృతిచెందింది. మృతురాలు మృతురాలి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు గురువారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేశ్ తెలిపారు.
Updated Date - 2021-10-22T05:22:43+05:30 IST