ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతి గింజనూ కొనాల్సిందే

ABN, First Publish Date - 2021-12-02T05:23:01+05:30

ప్రతి గింజనూ కొనాల్సిందే

ధాన్యం కొనుగోలుదారులతో మాట్లాడుతున్న కోదండరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రైతులను ఇబ్బందుల పాల్జేస్తే చూస్తూ ఊరుకోం
  • జాతీయ కిసాన్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి

యాచారం: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ప్రతిజా గింజకొనాల్సిందేనని, లేకుంటే రైతులతో కలిసి ఉద్యమాలు చేపడతామని జాతీయ కిసాన్‌సెల్‌ వైస్‌చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం యాచారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీచేసి రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు. 17శాతంలోపు తేమ, తాలు లేకుండా ధాన్యం తెచ్చినా కాంటా చేయడం లేదని రైతులు ఫిర్యాదు చేయడంతో ఆయన తనిఖీ చేశారు. డీసీఎంఎస్‌ అధికారులతో మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో ఫోన్‌లో మాట్లాడి రైతుల సమస్యలు వివరించారు. వడ్లకు మచ్చలున్నాయని మిల్లర్లు కూడా వాపస్‌ పంపడం ఏమిటని ప్రశ్నించారు. రైతులను ఇబ్బందుల పాల్జేసే వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకున్నా తప్పులేదని కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. లారీ వడ్లును ఎందుకు తిప్పి పంపారని ఇబ్రహీంపట్నం పవన్‌రై్‌స మిల్లు నిర్వాహకుడు అమిత్‌కుమార్‌చౌదరీకి ఫోన్‌ చేసి నిలదీశారు. మొత్తం వడ్లు అమ్ముడయ్యేదాక రోజూ రైతుల సమస్యలు తెలుసుకొని తనకు తెలియజేయాలని స్థానిక కాంగ్రెస్‌ నాయకులకు సూచించారు. ఆయన వెంట ఏవో సందీ్‌పకుమార్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు నర్సింహ, ఎండీ అక్బర్‌, రాజేందర్‌ ఉన్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో 98రైస్‌ మిల్లులుంటే 8మిల్లులకే టెండర్లు దఖలుపర్చడంతో ఎక్కువ వడ్లు కొ నడం లేదని పలువురు నాయకులు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-12-02T05:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising