ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా బిల్లును ఆమోదించాలి

ABN, First Publish Date - 2021-07-27T04:42:20+05:30

మహిళా బిల్లును ఆమోదించాలి

కలెక్టరేట్‌ వద్ద ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేడ్చల్‌ అర్బన్‌: మహిళలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్‌ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య(ఎన్‌ఎ్‌ఫఐడబ్యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి జె.లక్ష్మి డిమాండ్‌ చేశారు. ఈ సమావేశాల్లోనే మహిళా బిల్లుకు ఆమోదం తెలుపాలని సోమవారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించి అదనపు కలెక్టర్‌ నరసింహారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తమకు కావాల్సిన బిల్లులను దొడ్డిదారిన ప్రవేశపెడుతూ మహిళా బిల్లుకు మాత్రం అఖిలపక్షం సహకరించడంలేదంటూ చెప్పడం సరికాదన్నారు. పాలకులు మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని, కేంద్రం ఈ సమావేశాల్లోనే మహిళా బిల్లు ప్రవేశపెట్టాలన్నారు. ఉపాధ్యక్షురాలు గిరిజ, రాజేశ్వరి, సుగుణ, లత, లక్ష్మి పాల్గొన్నారు. 


బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలి

షాబాద్‌: బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణయాదవ్‌ నాయకులతో కలిసి సోమవారం ఢిల్లీలోని జాతీయ బీసీ కమిషనరేట్‌ను ముట్టడించారు. బీ సీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అప్పటి వరకు ఆందోళనలు చేపడుతామన్నారు. బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T04:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising