గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో..
ABN, First Publish Date - 2021-10-30T04:49:01+05:30
గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించడంతో..
- మొక్కజొన్న పంట దగ్ధం
మర్పల్లి: గుర్తుతెలియని వ్యక్తులు కుప్పగా పోసిన మొక్కజొన్న కంకులకు నిప్పంటించడంతో రూ.50వేల వరకు పంటనష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. మండలంలోని పంచలింగాల గ్రామానికి చెందిన సోమారం శంకరయ్య తనకున్న సర్వేనంబర్ 113, 215 పొలంలో ఎకరా మొక్కజొన్న పంట సాగుచేశాడు. పంట చేతికి రావడంతో కూలీలతో మొక్కజొన్న కంకులను పొలం నుంచి తీసి పొలంలోనే కుప్పగా నిల్వచేశాడు. కాగా గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పటించడంతో పంట పూర్తిగా దగ్ధమైంది. దీంతో తనకు రూ.50వేల నష్టం వాటిల్లిందని రైతు వాపోయాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితరైతు కోరుతున్నాడు.
Updated Date - 2021-10-30T04:49:01+05:30 IST