ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయి

ABN, First Publish Date - 2021-04-24T04:47:44+05:30

సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయి

ప్రజలనుద్ధేశించి మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, పక్కన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌
  •  కొత్తూర్‌లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

కొత్తూర్‌ : సీఎం కేసీఆర్‌ చేపడుతున్న పథకాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తాయని మంత్రి వి. శ్రీనివా్‌సగౌడ్‌ పేర్కొన్నారు. కొత్తూర్‌ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌, 4, 5, 6, 7 వార్డు అభ్యర్థులు గోవింద్‌నాయక్‌, హైమవతి, బి. సరస్వతీ వెంకటే్‌ష(సిటీ కేబుల్‌), కమ్మరి జయమ్మజనార్ధన్‌చారిలతో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అంతకుముందు పెంజర్ల రోడ్డులో ఉన్న మందోని మైసమ్మ గుడిలో మంత్రి, ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్డులతో పాటు మెయిన్‌రోడ్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి, కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. పెంజర్ల రహదారి, మెయిన్‌రోడ్డులో మేళతాళాలతో భారీ ర్యాలీ నిర్వహించగా, మంత్రి, ఎమ్మెల్యే ప్రజలకు నమస్కారం చేస్తూ అభివాదం చేశారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మంత్రి, ఎమ్మెల్యే ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించుకుని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొత్తూర్‌ మున్సిపాలిటీపై టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమని, అన్ని రంగాల్లో కొత్తూర్‌ను అభివృద్ధి చేయడమే టీఆర్‌ఎస్‌ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో కేశంపేట, కొత్తూర్‌ ఎంపీపీలు వై. రవీందర్‌యాదవ్‌, పి. మధుసూదన్‌రెడ్డి, జడ్పీ వైస్‌చైౖర్మన్‌ ఈటే గణేష్‌, స్థానిక జడ్పీటీసీ ఎమ్మె శ్రీలతాసత్యనారాయణ, షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైౖర్మన్‌ కె. నరేందర్‌, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు జిల్లెల వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు ఎమ్మె సత్యనారాయణ, పల్లె నర్సింగ్‌రావు, యాదగిరి, దేవేందర్‌యాదవ్‌, కమ్మరి జనార్ధన్‌చారి, ఆంజనేయులు, సిటీ కేబుల్‌ వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T04:47:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising