ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పుట్టపహాడ్‌ బాధితులకు అండగా ఉంటాం

ABN, First Publish Date - 2021-08-03T05:08:50+05:30

పుట్టపహాడ్‌ బాధితులకు అండగా ఉంటాం

ఆర్థికసాయం అందజేస్తున్న రామ్మోహన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి 


కులకచర్ల: పుట్టపహాడ్‌ గ్రామ బాధితులకు కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని వికారాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై స్పందించిన ఆయన రాఘవేందర్‌రెడ్డితో రైతుబీమా డబ్బులు కోల్పోయిన బాధితులు చంద్రమ్మ, మహబూబాబేగంను సోమవారం పుట్టపహాడ్‌ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. వారికి రూ.5వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టపహాడ్‌ గ్రామంలో అక్రమాలు వెలుగు చూస్తున్నా టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు స్పందించకపోవడం అన్యాయమన్నారు. కనీసం బాధితులను పరామర్శించిన పాపాన పోలేదని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్‌ పార్టీ వెన్నంటే ఉంటుందని తెలిపారు. పక్కీర్‌ హుస్సేన్‌ భార్య, సోదరితో పోలీసులకు ఫిర్యాదు చేయిస్తున్నామని తెలిపారు. రాఘవేందర్‌రెడ్డి వెనకాల ఓ ముఠానే ఉందని పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. బాధిత కుటుంబాలకు రాఘవేందర్‌రెడ్డి నుంచి డబ్బులు ఇప్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు భీంరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బీఎస్‌ ఆంజనేయులు, మాజీ ఎంపీపీ అంజిలయ్యగౌడ్‌, స్థానికులు వెంకట్‌రాములు, హరినాథ్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. 

కాంగ్రెస్‌లో చేరిక

దోమ: మండలంలోని దాదాపూర్‌ గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రూఫ్‌ఖాన్‌పేట్‌ రాములు సోమవారం డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజావ్యతిరేక విధానాలు, నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి, నాయకులు రమేశ్‌గౌడ్‌, దస్తయ్య, రాములుగౌడ్‌  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T05:08:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising