యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న
ABN, First Publish Date - 2021-03-29T05:36:35+05:30
యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న
- విగ్రహ ఆవిష్కరణలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి
ఘట్‌కేసర్: గోల్కొండ కోటను జయించి ఢిల్లీ సుల్తాన్ ఔరంగజేబును గడగడలాడించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న అని మంత్రులు వి.శ్రీనివా్‌సగౌడ్, చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం పోచారం మున్సిపాలిటీలోని యంనంపేట్‌లో స్థానిక గౌడ సంఘం నాయకుడు పోలగోని ప్రభాకర్‌గౌడ్ ప్రతిష్టించిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాలకులు పన్నుల కోసం ప్రజలను పీడిస్తున్న కాలంలో వారి బాధలు చూడలేక పోరాటం చేసిన మహనీయుడు సర్వాయి పాపన్న అని అన్నారు. తన ప్రతిభాపాటవాలు, యుద్ధ కళలతో గోల్కొండ కోటను జయించాడని గుర్తు చేశారు. ఢిల్లీ కోటను జయించేందుకు వ్యూహరచన చేస్తు న్నాడని భయాందోళనకు గురైన ఔరంగజేబు కుట్ర పన్ని పాపన్నను హత్య చేశారని గుర్తుచేశారు. అనంతరం గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఏడేళ్లుగా విన్నవిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వాపోయారు. మంత్రి మల్లారెడ్డి ముఖ్యమంత్రిని ఒప్పించి పాపన్న విగ్రహాన్ని ప్రతిష్టించేందకు చర్యలు తీసుకోవాలని కోరారు.
పాలకవర్గంలో మెజార్టీ సభ్యులు దూరం
కాగా యంనంపేట్‌లో సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మున్సిపాలిటీకి చెందిన మెజారిటీ పాలకవర్గ సభ్యులు దూరంగా ఉనారు. వీరంతా మంత్రి మల్లారెడ్డికి ము ఖ్య అనుచరులు అయినందున మంత్రి కార్యక్రమానికి దూరం గా ఉండటం మున్సిపాలిటీతోపాటు మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఘట్‌కేసర్ మున్సిపాలిటీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నప్పటికీ చైర్మన్, వైస్‌చైర్మన్, కౌన్సిలర్‌తోపాటు మెజారిటీ కౌన్సిలర్లు దూరంగా ఉండటం విశేషం.
మంత్రులు వస్తే కనీసం ముగ్గు పోయరా?
సర్దార్ పాపన్న విగ్రహావిష్కరణకు ఇద్దరు మంత్రులు వస్తే స్థానిక కౌన్సిలర్ ధనలక్ష్మి మున్సిపాలిటీ నుంచి రోడ్డు వెంట కనీసం ముగ్గు కూడా పోయించకపోవడం పట్ల స్థానిక గౌడ సంఘం నాయకులు పోలగోని శ్రవణ్‌కుమార్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న సినీ దర్శకుడు జైహింద్‌గౌడ్, ఎంపీపీ వై.సుదర్శన్‌రెడ్డి, కౌన్సిలర్లు, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-29T05:36:35+05:30 IST