ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుక్మాపూర్‌లో జాతర

ABN, First Publish Date - 2021-01-25T05:23:58+05:30

రుక్మాపూర్‌లో జాతర

మైలార్‌దేవరంపల్లిలో పూజలు చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దేముల్‌: రుక్మాపూర్‌లో గ్రామదేవత జాతర ఆదివారం నిర్వహించారు. గ్రామదేవత(ఊరడమ్మ) జాతర సందర్భంగా ఊరంతా బంధువులు, ఆడపడుచులతో నిండిపోయింది. అమ్మవారికి నైవేద్యాల సమర్పణకు మహిళలు బోనాలతో డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి చేరుకున్నారు. పోతురాజుల విన్యాసాలు అలరించాయి. నైవేద్యాల అనంతరం ఏర్పుల సాని భవిష్యవాణి విన్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ టి.అనురాధ, సర్పంచ్‌ శివలీల, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పరి రమేష్‌, రమేష్‌, మల్లేశం పూజలు నిర్వహించారు.

  • ఘనంగా కట్ట మైసమ్మ ఉత్సవాలు

వికారాబాద్‌: ప్రజలు సోదరభావంతో యేటా కట్ట మైసమ్మ జాతర జరుపుకోవాలని సర్పంచ్‌ తిరుపతిరెడ్డి అన్నారు. ఆదివారం మైలార్‌దేవరంపల్లిలో కట్టమైసమ్మ జాతరలో భాగంగా మహిళలు బోనాలతో, పోతురాజుల విన్యాసాలు మధ్య ఆలయానికి చేరుకున్నారు. ప్రజలు సుఖసౌభాగ్యాలతో తులతూగాలని అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్నారు.

Updated Date - 2021-01-25T05:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising