ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూరగాయల మార్కెట్‌ విభజన

ABN, First Publish Date - 2021-05-19T05:07:55+05:30

కూరగాయల మార్కెట్‌ విభజన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంషాబాద్‌ : కరోనా ప్రబలకుండాఉండేదుకు శంషాబాద్‌ కూరగాయల మార్కెట్‌ను రెండు విభాగాలుగా చేయాలని సమావేశంలో తీర్మానించారు. ప్రస్తుతం కొనసాగుతున్న కూరగాయల మార్కెట్‌ వల్ల స్థానికంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని స్థానిక అధికారులు అంచనా వేశారు. దీంతో మార్కెట్‌ కమిటీ సభ్యులు, పోలీసులు, మున్సిపల్‌ సిబ్బంది మంగళవారం సాయంత్రం ఆర్జీఐఏ పోలీ్‌సస్టేషన్‌లో సమావేశమయ్యారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మ, ఏసీపీ భాస్కర్‌, సీఐ విజయ్‌కుమార్‌ సమావేశంలో పాల్గొని కరోనా కట్టడికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. కూరగాయ మార్కెట్‌లో కేవలం కాయగూరలే అమ్మాలని ఆకుకూరలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో అమ్మాలని తీర్మానించారు. కూరగాయలు పండించే రైతులు తెల్లవారు జామున 4 గంటలకు మర్కెట్‌కు తీసుకురావాలన్నారు. ఉదయం 6 గంటలలోపు వ్యాపారులు అవి కొనుగోలు చేసి వెళ్లిపో వాలని, కాయగూరలు అమ్మేవారు ఉదయం 6నుంచి 10గంటల వరకు ప్రస్తుతం ఉన్న కూరగాయల మార్కెట్‌లో అమ్మకాలు సాగించుకోవాలన్నారు. ఆకుకూరలు అమ్మేవారు కొత్తగా కేటాయించిన ప్రాంతానికి వెళ్లి లాక్‌డౌన్‌ ప్రారంభానికి ముందే అమ్మకాలు పూర్తి చేసుకోవాలని తీర్మానించారు. మున్సిపల్‌ సిబ్బంది, పోలీసులు ఆ రెండు ప్రాంతాల్లో కొనుగోలుదారులు నిబంధనలు పాటించేలా చూడాలన్నారు.

Updated Date - 2021-05-19T05:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising