ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయాలకతీతంగా వాణీదేవిని గెలిపించాలి

ABN, First Publish Date - 2021-02-28T05:56:10+05:30

రాజకీయాలకతీతంగా వాణీదేవిని గెలిపించాలి

కందుకూరులో మాట్లాడుతున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి 


కందుకూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురభి వాణీదేవిని పెద్దల సభకు పంపి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచుదామని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం కందుకూరులోని సామ నర్సింహారెడ్డి ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్‌ మహేశ్వరం నియోజకవర్గం కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర కీర్తిని ఢిల్లీలో చాటిన మహనీయుడి కుటుంబంలో ఎమ్మెల్సీకి చోటు కల్పించడానికి సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు సైతం మెచ్చుకుంటున్నాయని తెలిపారు.  ప్రతి ఓటరు వద్దకు వెళ్లి వాణీదేవిని గెలిపించేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనీతారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కప్పాటి పాండురంగారెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్సీ ఇప్పటివరకు ఈ ప్రాంతంలో పర్యటించిన పాపాన పోలేదన్నారు. కేవలం ఎన్నికల ముందు ప్రజల వద్దకు వచ్చే వారిని కాకుండా ప్రతినిత్యం ప్రజలతో ఉండే వారిని ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో  మీర్‌పేట్‌, బడంగ్‌పేట్‌ మేయర్లు దుర్గా దీ్‌పలాల్‌, పారిజాతనర్సింహారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి, మార్కెట్‌ కమిటీచైర్మన్‌ ఎస్‌ వరలక్ష్మీసురేందర్‌రెడ్డి, సహకార సంఘం చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌, వైస్‌చైర్మన్‌ విజయేందర్‌రెడ్డి, జయేందర్‌, రాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-28T05:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising