ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

ABN, First Publish Date - 2021-10-22T05:22:33+05:30

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

మాడ్గుల: టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న జిల్లా అధికారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడ్తాల్‌/మాడ్గుల/చేవెళ్ల: కడ్తాల్‌ మండలం మర్రిపల్లిలో గురువారం పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు.  సర్పంచ్‌ సుంకరి భాగ్యమ్మజంగయ్య, ఎంపీటీసీ ఉమవతిబుగ్గయ్యగౌడ్‌లు ప్రారంభించారు. పశువైద్య అధికారి రుద్రాక్షవిజయ్‌ ఆధ్వర్యంలో 213 ఆవులు, 44 గేదెలకు టీకాలు వేశారు. ప శువైద్య సిబ్బంది వెంకటయ్య, మల్లేశ్‌, రమేశ్‌, బుర్హానుద్దీన్‌, శేఖర్‌, అఫ్సర్‌, వాల్య, నవీన్‌, శ్రీశైలం పాల్గొన్నారు. తలకొండపల్లి మండలం వెంకట్రావ్‌పేటలో పశువులకు టీకాలు వేశారు. సర్పంచ్‌ హైమవతిరమేశ్‌ శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్‌ వెం కటేశ్వర్లు టీకాలు వేశారు. ఉపసర్పంచ్‌ రవి, టీఆర్‌ఎస్‌ రాజు, ఆంజనేయులు, శేఖర్‌, మశ్చందర్‌ పాల్గొన్నారు. మాడ్గుల మండలం అవురుపల్లిలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ అంజలప్ప పశువులకు టీకాల కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పశువులకు నోట్లో, కాలి గిట్టల మధ్య పుండు పుట్టి అనారోగ్యం బారినపడి పశువులు చనిపోయే ప్రమాదం ఉందని రైతులకు తెలిపారు. అందుకే వాటికి టీకాలు తప్పక వేయించాలన్నారు. పశువైద్యులు శేఖర్‌, రేఖ, శిబ్బంది రాజరాములు, శివప్రసాద్‌, నయీం, జహాంగిర్‌, అంజయ్య పాల్గొన్నారు. చేవెళ్ల మండల పశువైద్యాధికారి శిరీష చన్‌వెళ్లి, ఇక్కరెడ్డిగూడ గ్రామాల్లో పశువులకు టీకాలు వేశారు. పశుపోషణపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T05:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising