ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ వేయడం స్ఫూర్తిదాయకం

ABN, First Publish Date - 2021-06-14T05:09:12+05:30

వ్యాక్సిన్‌ వేయడం స్ఫూర్తిదాయకం

వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాదయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొయినాబాద్‌ రూరల్‌: గ్రామీణ ప్రాంత ప్రజల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేటు విద్యాసంస్థలు వ్యాక్సినేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని చేవెళ్ల కాలె యాదయ్య అన్నారు. ఆదివారం హిమాయత్‌నగన్‌ పరిధి పల్లవి ఇంటర్‌నేషనల్‌ పాఠశాల ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు ఆసుపత్రి సౌజన్యంతో మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ కరోనాకు టీకానే సరైన ఔషధమని, ప్రతిఒక్కరూ టీకా వే సుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జయవంత్‌, అనంతరెడ్డి, రవియాదవ్‌, పీఏసీఏస్‌ మాజీ చైర్మన్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అజీజ్‌నగర్‌ ఉపసర్పంచ్‌ శ్రీనివా్‌సరెడ్డి, పల్లవి పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


  • టీకా కోసం బారులుతీరిన జనం


పల్లవి ఇంటర్‌నేషనల్‌ పాఠశాలలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్‌ కేంద్రానికి జనం పెద్దఎత్తున తరలివచ్చారు. కొందరు భౌతికదూరం పాటించకుండా గుంపులుగా ఎగబడడంతో మిగతావారు పాఠశాల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నవారికే టీకాలు వేస్తామని చెప్పి, తమకు నచ్చివారికి ఇష్టానుసారం టీకా వేయిస్తున్నారని క్యూలో నిలబడిన జనం ఆగ్రహం వ్యక్తం చేశారు.


  • అర్హులందరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి


చేవెళ్ల: నిబంధనల మేరకు అర్హులందరూ టీకాలు వేయించుకోవాలని ఏబీవీపీ చేవెళ్ల నగర కార్యదర్శి శిరీష అన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో చేవెళ్ల రైతుబజార్‌లో పండ్ల వ్యాపారులందరికీ టెంపరేచర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మాస్కులు ధరి ంచాలన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సాయి, శివప్రసాద్‌, వడ్డె శివ, బండారి శివ, రాహుల్‌, చైతన్యం, ఆనంద్‌, శశి పాల్గొన్నారు.


  • సూపర్‌స్ర్పెడర్లకు వ్యాక్సినేషన్‌ విజయవంతం


ఇబ్రహీంపట్నం: సూపర్‌స్ర్పెడర్లకు వాక్సినేషన్‌ ఆదివారం మున్సిపాలిటీలో విజయవంతంగా ముగిసింది. 2,654 మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ నెల 5 నుంచి వివిధ కేటగిరీలకు చెందిన స్ర్పెడర్లకు వ్యాక్సిన్‌ వేశారు. కమిషనర్‌ జయంత్‌కుమార్‌రెడ్డి, వైద్యాధికారి డా.జెరుషా నేతృత్వంలో ఈ కార్యక్రమం కొనసాగింది.

Updated Date - 2021-06-14T05:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising