ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-10-30T04:51:39+05:30

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌: బైక్‌ అదుపుతప్పి ఓ బీటెక్‌ విద్యార్థి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.  నగరంలోని నాచారం, రాఘవేంద్రనగర్‌ కాలనీకి చెందిన సందూరి రవీందర్‌రెడ్డి కుమారుడు సందూరి దీపక్‌రెడ్డి ఘట్‌కేసర్‌ మండలం ఘణాపూర్‌లోని కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం బైక్‌పై కళాశాలకు వెళుతుండగా అన్నోజిగూడ-ఘణాపూర్‌ మార్గమధ్యలో అవుటర్‌ రింగురోడ్డు పక్కనగల సర్వీసురోడ్డు సమీపంలో బైక్‌ అదుపుతప్పి పడటంతో దీపక్‌రెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్‌లో జోడిమెట్లలోని క్యూర్‌ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం మేడిపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ  చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు. 

అనుమానాస్పద స్థితిలో యువకుడు.. 

దోమ: అనుమానస్పద స్థితిలో ఓయువకుడు బైక్‌పై నుంచి కిందపడి తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కులకచర్ల మండల కేంద్రానికి చెందిన గుడాల ఆనందం పద్మమ్మల కుమారుడు చందు(19) గురువారం సాయంత్రం దిర్సంపల్లి నుంచి దాదాపూర్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో అనంతరెడ్డిపల్లి గేట్‌ మూల మలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి పడటంతో చందుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన జనార్దన్‌రెడ్డి అనే వ్యక్తి అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్‌ ఎస్‌వీఎస్‌ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ చందు గురువారం రాత్రి మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు ఇది ప్రమాదం కాదని, ఎవరో కొట్టి చంపి, బైక్‌ను ధ్వంసంచేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలంలో ఉన్న జనార్దన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేశ్‌ తెలిపారు.  

Updated Date - 2021-10-30T04:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising