ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యకర్తల కృషితో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌

ABN, First Publish Date - 2021-09-17T06:01:19+05:30

కార్యకర్తల కృషితో తిరుగులేని శక్తిగా టీఆర్‌ఎస్‌

సమావేశంలో మాట్లాడుతున్న పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి 

పరిగి: టీఆర్‌ఎస్‌ పార్టీ దేశంలోనే తిరుగులేని శక్తిగా అవతరించిందని, అదికార్యకర్తల కృషి ఫలితమేనని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్‌పాష అన్నారు. గురువారం పరిగిలోని బృందావన్‌ గార్డెన్‌లో జరిగిన తాలుకాస్థాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌, రాజకీయంగా తిరుగులేని పార్టీగా ఎదిగిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏడేళ్లలో  ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలో కార్యకర్తలే కీలకపాత్ర పోషించారని తెలిపారు. దేశంలో ఏపార్టీకి లేనివిధంగా టీఆర్‌ఎ్‌సకు 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. పార్టీసంస్థాగత, నామినెటేడ్‌ పదవుల్లో పారదర్శకంగా ఉంటుందన్నారు. కార్యకర్తల అభిష్టం మేరకు పదవుల ఎంపిక జరుగుతోందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఎక్కడా చెల్లక ఉనికి కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. కార్యకర్తలు ఇదే స్ఫూర్తితో మరో రెండేళ్లు పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో తిరిగి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయని, ఆన్ని రాష్ట్రాల ప్రజలు మన రాష్ట్రం వైపు చూస్తున్నారని తెలిపారు.  కొత్త కమిటీలతో గ్రామాల్లో నూతనోత్తేజం  తేవాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్‌ డి.మనోహర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఎం.అశోక్‌, పరిగి, దోమ, పూడూరు, గండీడ్‌ ఎంపీపీలు అరవింద్‌రావు, అనసూయ, మల్లేశం, సత్తమ్మ, జడ్పీటీసీలు బి.హరిప్రియ, కె.నాగిరెడ్డి, ఎంపీ మేఘమాల, రాందాస్‌, శ్రీనివా్‌సరెడ్డి, పరిగి, కులకచర్ల ఏఎంసీ చైర్మన్‌ ఎ.సురేందర్‌, భృంగి హరికృష్ణ, పీఏసీఎస్‌ చైర్మన్‌ కె.శ్యాంసుందర్‌రెడ్డి, కమతం శ్రీనివా్‌సరెడ్డి, ఆర్‌.అంజనేయులు, బి.ప్రవీణ్‌రెడ్డి, ఎస్‌.భాస్కర్‌ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-17T06:01:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising