ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు కొత్తూరు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

ABN, First Publish Date - 2021-05-07T05:44:24+05:30

నేడు కొత్తూరు చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏర్పాట్లు చేస్తున్న అధికారులు

కొత్తూర్‌: కొత్తూర్‌ మున్సి పాలిటీ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక శుక్రవారం స్థానిక మున్సి పాలిటీ కార్యాలయంలో నిర్వహిం చనున్నారు. ఇందుకోసం మున్సి పల్‌ కమిషనర్‌ జనుంపల్లి జ్యోతి ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మున్సిపాలిటీలోని 12వార్డుల్లో ఏడు వార్డుల్లో టీఆర్‌ఎస్‌, ఐదు వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. కౌన్సిల్‌లో టీఆర్‌ఎస్‌కు పూర్తి మెజారిటీ రావడంతో చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ స్థానా లనూ ఆ పార్టీ దక్కించుకునే అవకాశ ముంది. అయితే, ఈ పదవులు ఎవరికి దక్కుతాయన్న విషయంలో క్లారిటీ లేదు. చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు పొందేవారి పేర్లు టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం సీల్డ్‌కవర్‌లో ఉంచి మంత్రికి అందజేసినట్లు సమాచారం. సీల్డ్‌కవర్‌లో ఎవరిపేర్లు ఉంటే వారికి పార్టీ కౌన్సిలర్లు ఓటు వేయాలని పార్టీ ఆదేశించింది. ఎన్నికల పరి శీలకుడిగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ను నియమించింది. 


  • మధ్యాహ్నం 3.30గంటలకు చైర్‌పర్సన్‌ ఎన్నిక

కౌన్సిలర్లుగా గెలుపొందిన అభ్యర్థులకు కొత్తూర్‌ మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం 3గంటలకు ప్రమాణ స్వీకారం చేయిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ జ్యోతి తెలిపారు. అనంతరం 3.30గంటలకు చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నిక జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా కౌన్సిలర్లలో ఎవరికైనా కొవిడ్‌ పాజిటివ్‌ ఉంటే వీడియో కాలింగ్‌ ద్వారా తన ఓటును వినియోగించుకోవచ్చని కమిషనర్‌ తెలిపారు.


  • కొవిడ్‌ నిబంధనలతో ఎన్నిక నిర్వహించాలి : కలెక్టర్‌ 

కొత్తూర్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్ల ఎన్నికను పూర్తిస్థాయి కొవిడ్‌ నిబంధనలతో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తూర్‌ మున్సిపాలిటీ కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. ఎన్నిక ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనలను తప్పకుండా పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌ వెంట జడ్పీ సీఈవో దిలీప్‌కుమార్‌, షాద్‌నగర్‌ ఆర్డీవో రాజేశ్వరి, మున్సిపల్‌ కమిషనర్‌ జనుంపల్లి జ్యోతి, మేనేజర్‌ మంజులత ఉన్నారు. 

Updated Date - 2021-05-07T05:44:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising