ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని..

ABN, First Publish Date - 2021-10-29T04:59:33+05:30

పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని..

ఆందోళన వ్యక్తం చేస్తున్న జంగయ్య, జంగమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • దళిత దంపతుల ఆత్మహత్యాయత్నం 

పరిగి: తరతరాలుగా అనుభవిస్తున్న తమ భూమికి పట్టా పాసుపుస్తకం ఇవ్వాలని దళిత దంపతులు గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. సయ్యద్‌పల్లి గ్రామంలోని సర్వే నెంబర్‌ 61లో గల 4.18 ఎకరాల భూమిని 1960 సంవత్సరంలో వీరప్ప నుంచి అదే గ్రామానికి చెందిన లచ్చయ్య కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి లచ్చయ్య కొడుకు జంగయ్య పంటసాగు చేస్తున్నారు. భూమికి సంబంధించి వీరప్ప మనుమళ్లు మల్లేశ్‌, గణేశ్‌ల పేరిట పట్టాపుస్తకాలు వచ్చాయి. ఏళ్ల కాలంగా సాగులో చేస్తుండగా, పట్టాపుస్తకాలు వారికి రావ డం ఏమిటని జంగయ్య, అతని కొడుకు గణేశ్‌ వాపోతున్నారు. తమ భూమికి సంబంధించి కొత్త పట్టాపాసుపుస్తకం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యాలయ సిబ్బంది వారికి నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో ఎస్‌ఐ రమేశ్‌ అక్కడికి వచ్చి వారిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. ఈ విషయంమై తహసీల్దార్‌ విద్యాసాగర్‌రెడ్డిను వివరణ కోరగా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Updated Date - 2021-10-29T04:59:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising