ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఉమ్మడి జిల్లాలో ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2021-06-17T05:46:22+05:30

కరోనాతో ఉమ్మడి జిల్లాలో ముగ్గురి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తలకొండపల్లి/ధారూరు/కందుకూరు: ఉమ్మడి జిల్లాలో కరోనా తో మరో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తలకొండపల్లి మండలం తాళ్లగుట్ట తండాకుచెందిన వ్యక్తి(36) కరోనాతో బుధవారం మృతి చెందాడు. అతడు పది రోజుల క్రితం కరోనా బారినపడి అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడి కు టుంబాన్ని టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, చు క్కాపూర్‌ అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి పరామర్శించారు. వికారాబాద్‌ జిల్లా ధా రూరు మండలంలో కరోనాతో చికిత్స పొందుతూ మహిళ మృతి చెంది ంది. ఎస్సై సురేష్‌ తెలిపిన వివరాలిల ప్రకారం.. ధారూరుకు చెందిన  మహిళ(50)కు ఈ నెల 10న పాజిటివ్‌ వచ్చింది. ఆమెను కుటుంబీకు లు నగరంలోని ప్రైవేట్‌ అసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్యం విషమించటంతో మృతి చెందిందని ఎస్‌ఐ సురేష్‌ వివరించారు. అలాగే రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని దెబ్బడగూడలో కరోనా బారిన పడి వ్యక్తి(46) మృతిచెందాడు. అతడికి 9 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌ రావడంతో చికిత్స నిమిత్తం కుటుంబీకులు నగరంలోని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. అతడికి కుమారుడు, భార్య ఉన్నారు. కరోనాతో మృతిచెందిన వారి కుటుంబా లను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - 2021-06-17T05:46:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising