ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయగర్జన సభను విజయవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-10-21T04:44:21+05:30

వచ్చే నెల 15న వరంగల్‌లో జరగనున్న

సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ 


ఇబ్రహీంపట్నం: వచ్చే నెల 15న వరంగల్‌లో జరగనున్న టీఆర్‌ఎస్‌ విజయగర్జన సభకు ప్రజాప్రతినిఽధులు, పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాల సభ్యులు ఎక్కువ సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని తెలంగాణ భవన్‌లో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ప్రజాప్రతినిఽధులు, మండల, మున్సిపాలిటీల కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులు సబితాఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, వాణీదేవి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్‌, అరెకపూడి గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కేటీఆర్‌ మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతిగ్రామం, మున్సిపాలిటీ వార్డుల నుంచి ఒక్కో బస్సు చొప్పున సభకు రావాల్సి ఉందన్నారు. ప్రజాప్రతినిఽధులు, మండల, మున్సిపల్‌ పార్టీ కమిటీలు, అనుబంధ సంఘాలకు చెందినవారు, ముఖ్య నాయకులు సభకు హాజరయ్యేలా చూడాలని ఆయన సలహా చేశారు. ప్రజా ప్రతినిధులు కార్లలో వస్తే ట్రాఫిక్‌ జామ్‌ అయ్యే అవకాశముంటుంది గనుక వీలైనంత మేర బస్సుల్లోనే రావాలని ఆయన సూచించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో గ్రామపంచాయతీలు, మున్సిపల్‌ వార్డులు 166 ఉన్నాయని ప్రతి పంచాయతీ, మున్సిపల్‌ వార్డుల నుంచి ఒక్కో బస్సు చొప్పున బయలుదేరేలా చూస్తామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ యువ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి (బంటి), జిల్లా రైతుబంధు అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, కర్నాటి రమేష్‌గౌడ్‌, మొద్దు అంజిరెడ్డి, బుస్సు పుల్లారెడ్డి, కొంగల్ల జోగిరెడ్డి, ఎంపీపీలు కృపేష్‌, నర్మద, నాయకులు చిలుకల బుగ్గరాములు, అల్వాల వెంకట్‌రెడ్డి, కొప్పు జంగయ్య, చీరాల రమేష్‌ తదితరులున్నారు. 



Updated Date - 2021-10-21T04:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising