ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కోల్పోయిన వారికి అండగా ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-04-24T04:59:34+05:30

ఉపాధి కోల్పోయిన వారికి అండగా ప్రభుత్వం

రాంపల్లిలో ప్రైవేట్‌ టీచర్లకు బియ్యం పంపిణీ చేస్తున్న చంద్రారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి


కీసర రూరల్‌/మేడ్చల్‌/ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌: కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ పరిధి రాంపల్లిలో ప్రైవేట్‌ టీచర్లకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బిజ్జ శ్రీనివా్‌సగౌడ్‌, నగే్‌షగౌడ్‌, కళావతి, లక్ష్మి, కో-ఆప్షన్‌ సభ్యుడు అశోక్‌, నాయకులు, తదితరులున్నారు. మేడ్చల్‌ మండలంలోని మునిరాబాద్‌, గౌడవెల్లి గ్రామాల్లో సర్పంచులు గణేష్‌, సురేందర్‌ముదిరాజ్‌లు టీచర్లకు బియ్యం అందజేశారు. కార్యక్రమాల్లో ఉపసర్పంచులు నర్సింగ్‌రావు, పెంటమ్మ, వార్డుసభ్యులు పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి మున్సిపల్‌ పరిధిలో 24మంది ప్రవేట్‌ టీచర్లకు బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు మల్లేష్‌, అంజనేయులు, జహంగీర్‌, కో-ఆప్షన్‌ సభ్యుడు ఎస్‌కే షౌకత్‌మియా, నాయకులు పల్లె విజయ్‌, సిరాజ్‌, సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు. ఘట్‌కేసర్‌ రూరల్‌ మండలంలోని కాచవానిసింగారంలో ఏడుగురు ప్రైవేటు టీచర్లకు సర్పంచ్‌ కొంతం వెంకట్‌రెడ్డి బియ్యం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ విష్ణుగౌడ్‌ పాల్గొన్నారు. 

బొంరాస్‌పేట్‌లో..

బొంరాస్‌పేట్‌: ప్రభుత్వం తరఫున స్థానిక ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు ఎంపీపీ హేమీబాయి శుక్రవారం బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కలిసికట్టుగా కరోనాకట్టడికి కృషిచేయాలని కోరారు. ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు 25కిలోల బియ్యంతో పాటు రూ.2వేలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు కోట్లయాదగిరి, రామకృష్ణయాదవ్‌, రేషన్‌డీలర్లు రాములు, దాసప్ప, రాములనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-24T04:59:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising