ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష్యాన్ని వందశాతం పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2021-08-26T05:08:05+05:30

ఈ ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులకు నిర్దేశించిన

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అమయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • బ్యాంకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఈ ఆర్థిక సంవత్సరానికి బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేయాలని బ్యాంకర్లను జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మంది రంలో డీడీసీ/డీఎల్‌ఆర్‌సీ సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సన్న చిన్నకారు రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా బ్యాంకర్లు పంట రుణాలు అందించాలని ఆదేశించారు. రైతులు రుణాలు తీసుకునే విధంగా వ్యవసాయ అధికారులు, బ్యాంకర్లు అవ గాహన కల్పించాలని సూచించారు. వీధి వ్యాపారులకు, చిరువ్యాపారులకు రుణాలు అందించాలని సూచించారు. బ్యాంకుల ద్వారా అమలు చేసే వివిధ పథకాల కింద అందించే ఆర్థిక సహాయం సకాలంలో అందిస్తే వారు అభివృద్ది చెందే అవకాశం ఉందని, ఆ దిశగా బ్యాంకర్లు కృషి చేయాలని తెలిపారు. పంట రుణాల పంపిణీ, వ్యవసాయ కాల పరిమితి రుణాలు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు ఇచ్చే రుణాలు, చిన్న మధ్య తరహా పరిశ్ర మలు, గృహ రుణాల వంటి వాటి విషయంలో ఉదారత్వంతో బ్యాంకర్లు సహ కారం అందించాలని కోరారు. మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనం తరం స్టేట్‌ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చిలుకూరు వార్షిక కార్యాచరణ 2020-21 బుక్‌ను కలెక్టర్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రిజ్వాన్‌, ఆర్బీఐ అధికారి కృష్ణారావు, నాబార్డు ఎజీఎం ప్రవీణ్‌కుమార్‌ జిల్లాఅధికారులు, బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-26T05:08:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising