ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లక్ష మొక్కలు నాటడమే లక్ష్యం

ABN, First Publish Date - 2021-07-26T05:24:15+05:30

లక్ష మొక్కలు నాటడమే లక్ష్యం

అంతారం అటవీక్షేత్రంలో మొక్కలను పరిశీలిస్తున్న అటవీ రేంజ్‌అధికారి శ్యాంసుందర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 50వేల మొక్కలు నాటాం
  • నెలాఖరుకు లక్ష్యాన్ని పూర్తిచేస్తాం
  • తాండూరు అటవీ రేంజ్‌ అధికారి శ్యాంసుందర్‌రావు


తాండూరు రూరల్‌: హరితహారంలో భాగంగా తాండూరు అటవీ రేంజ్‌ పరిధిలోని గొట్లపల్లి, నాగులపల్లి, ఆడ్కిచర్ల, తట్టేపల్లి, మైల్వార్‌, జినుగుర్తి, అటవీక్షేత్రాల్లో లక్ష మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమని అటవీ రేంజ్‌ అధికారి శ్యాంసుందర్‌ తెలిపారు. ప్రస్తుతం 50వేల మొక్కలు నాటామని, మరో 50వేల మొక్కలు ఈనెలాఖరు నాటికి నాటేలా చర్యలు చేపట్టారు. మైల్వార్‌ అటవీ రేంజ్‌లో 3,320మొక్కలు, కంపార్ట్‌మెంట్‌లో 3,320మొక్కలు నాటామని తెలిపారు. గ్యాప్‌ ప్లాంటేషన్‌లో భాగంగా మైల్వార్‌లోని రిజర్వ్‌ఫారె్‌స్టలో మొక్కలు నాటారు. జినుగుర్తి రిజర్వ్‌ ఫారె్‌స్టలో కానుగ, నెమలి నారా, రావి, మర్రి, విప్ప, అల్లనేరేడు, వేప మొక్కలు నాటారు. పెద్దేముల్‌ మండలం ఆడ్కిచర్ల రిజర్వ్‌ ఫారె్‌స్టలో 10వేల హెక్టార్లలో 11,110 మొక్కలకు గానూ 3వేల మొక్కలు, తట్టేపల్లి, నాగులపల్లి రిజర్వ్‌ ఫారె్‌స్టలో 11,111 మొక్కలకు గానూ 8,200 మొక్కలు నాటారు. గ్యాప్‌ ప్లాంటేషన్‌ కింద రోడ్ల వెంబడి 30కిలోమీటర్ల దూరంలో 6వేల మొక్కలు, నాగులపల్లి అటవీ క్షేత్రంలో 25కిలోమీటర్ల 16,650, ఆడ్కిచర్లలో 26,510 మొక్కలు నాటారు. ప్రధానంగా అటవీ క్షేత్రాల్లో గచ్చగాయ, కానుగ, టేకు, కలబంద వంటి మొక్కలను నాటారు. వర్షాలు కురిస్తే మిగతా 50వేల మొక్కలను నాటే ప్రయత్నం చేస్తున్నట్లు అటవీ రేంజ్‌ అధికారి శ్యాంసుందర్‌రావు తెలిపారు. ఈమొక్కలను సెక్షన్‌ ఆఫీసర్లు తాజొద్దీన్‌ పర్యవేక్షిస్తున్నారు. 

Updated Date - 2021-07-26T05:24:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising