ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హత్యాయత్నానికి దారితీసిన వివాహేతర సంబంధం

ABN, First Publish Date - 2021-10-22T05:23:27+05:30

హత్యాయత్నానికి దారితీసిన వివాహేతర సంబంధం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘట్‌కేసర్‌ రూరల్‌: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు హత్యాయత్నానికి గురైన ఘటన ఘట్‌కేసర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. జవహర్‌నగర్‌లోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఎడ్ల దేవ(30) పెయింటర్‌గా పని చేస్తున్నాడు. కొన్ని రోజులుగా కుషాయిగూడ సమీపంలోని చక్రిపురానికి చెందిన ఇద్దరు పిల్లలున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. గత సెప్టెంబర్‌లో ఆ మహిళ తన ఇద్దరు పిల్లలను ఇక్కడే వదిలేసి దేవతో కలిసి ఏపీలోని వైజాగ్‌కు పారిపోయి కాపురం పెట్టారు. ఈ క్రమంలో ఆ మహిళ పిల్లలపై ప్రేమతో తిరిగి వచ్చి కుషాయిగూడలోని చక్రిపురంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటుంది. కాగా, సోదరితో పారిపోయిన దేవను ఎలాగైనా హతమార్చాలని ఆమె సోదరుడు నవీన్‌ కక్షగట్టాడు. గురువారం మధ్యాహ్నం ఘట్‌కేసర్‌, ఘణాపూర్‌ సమీపంలోని ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు పక్కన దేవపై అతడి స్నేహితుడితో కలిసి కత్తితో హత్యాయత్నం చేయగా అతడు తప్పించుకుని రోడ్డుపైకి వచ్చి గట్టిగా కేకలు వేయడంతో వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకునేలోపు నవీన్‌ అతడి స్నేహితుడు అక్కడి నుంచి పారిపోయారు. కాగా, దేవాను ఘట్‌కేసర్‌లోని కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.

Updated Date - 2021-10-22T05:23:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising