ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి

ABN, First Publish Date - 2021-10-28T04:04:33+05:30

అనుమానాస్పద స్థితిలో నవవధువు మృతి

శ్రావణి మృతదేహం వద్ద రోదిస్తున్న పుట్టింటి వారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భర్తే చంపాడంటూ తల్లిదండ్రుల ఆందోళన


మొయినాబాద్‌: భర్త, అతడి కుటుంబీకుల వేధింపులకు ఓ నవవధువు బలైంది. పెళ్లై ఏడాది తిరక్కుండానే అత్తగారింట్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన చిలుకూరులో బుధవారం జరిగింది. గ్రామస్తులు, మృతురాలి బంఽధవులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం యావాపూర్‌నకు చెందిన శ్రావణి(26)కి చిలుకూరుకు చెందిన అవురం రాజశేఖర్‌రెడ్డితో 2020 నవంబర్‌27న వివాహమైంది. పెళ్లి సమయంలో వధువు కుటుంబసభ్యులు 40తులాల బంగారం, రూ.40లక్షలు, తూప్రాన్‌లో ఒక ఎకరం భూమి కట్నంగా ఇచ్చారు. కొంతకాలం భార్య, భర్తలు బాగానే ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం శ్రావణి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఫ్యాన్‌కు శ్రావణి మృతదేహం వేలాడుతుండగా ఆమె అత్త, చుట్టుపక్కల వారు కిందికి దింపారు. అప్పటికే శ్రామణి మృతిచెందింది. గ్రామస్తుల సమాచారంతో  పోలీసులు చేరుకొని వివరాలు సేరించారు. బుధవారం శ్రావణి తన తల్లి పద్మకు ఫోన్‌ చేసింది. తాను చనిపోతానంటూ తల్లితో ఏడుస్తూ చెప్పి ఫోన్‌కట్‌చేసింది. వెంటనే తల్లి ఫోన్‌చేసినా ఎత్తలేదు. అదనపు కట్నం కోసం భర్త వేధించే వాడని, దసరాకు ముందు శ్రావణిని కొట్టాడని పుట్టింటి వారు తెలిపారు. రాజశేఖర్‌రెడ్డే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అన్నారు.

పరారీలో భర్త.. బంధువుల ఆందోళన.. 

శ్రావణి భర్త రాజశేఖర్‌రెడ్డి పరాయ్యాడు. అతడిని పట్టుకొచ్చేంతవరకు శ్రావణి మృతదేహాన్ని తీయనీయం అని ఆమె పుట్టింటి వారు ఆందోళనకు దిగారు. రాత్రివరకూ  మృతదేహాన్ని తీయనివ్వలేదు. తాము రాకముందే శ్రావణి మృతదేహాన్ని ఎందుకు కిందికి దించారని ప్రశ్నించారు. రాత్రి 8గంటల వరకు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. శ్రావణి అత్తారింటి వద్ద బంధువులు ఆందోళన చేస్తున్నారు. మృతదేహాన్ని తరలించకుండా పోలీసులను అడ్డుకున్నారు. రాజశేఖర్‌రెడ్డిని పట్టుకు రావాలని డిమాండ్‌ చేస్తున్నారు.


Updated Date - 2021-10-28T04:04:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising