ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీజీఈటీ-మ్యాథ్స్‌లో విద్యార్థుల ప్రతిభ

ABN, First Publish Date - 2021-10-22T05:21:12+05:30

సీపీజీఈటీ-మ్యాథ్స్‌లో విద్యార్థుల ప్రతిభ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి): పోస్టు గ్యాడ్యుయేషన్‌లో ప్రవేశాల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సెంట్రల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ)-2021 మ్యాథమెటిక్స్‌ భాగంలో వికారాబాద్‌ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మండలంలోని కొటాలగూడ గ్రామానికి చెందిన ఎళ్లనోళ్ల శిరీష ఎంఎస్సీ మ్యాథమెటిక్స్‌ ప్రవేశ పరీక్షలో 70మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు కైవసం చేసుకుంది. అదేవిధంగా ఎంఎస్సీ మ్యాథ్స్‌లో పి.సాయితేజ 11వ ర్యాంకు సాధించగా, పి.మురళి 13వ ర్యాంకు, ఎస్‌.ఉపేందర్‌ 18వ ర్యాంకు, వై.శ్రావణి 22వ ర్యాంకు, కె.అరుణ 32వ ర్యాంకు, ఎ.మాధురి 33వ ర్యాంకు, జి.తిరుపతి 81వ ర్యాంకు, ఎం.సుమన 101 ర్యాంకు, ఆర్‌.సుభాష్‌ 107వ ర్యాంకు సాధించారు. వీరంతా వికారాబాద్‌ పట్టణంలోని మ్యాథ్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ డైరెక్టర్‌ రత్నాకర్‌ వద్ద శిక్షణ తీసుకున్నారు. రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన ఈ విద్యార్థులను రత్నాకర్‌ అభినందించారు. ఈ సందర్భంగా మూడో ర్యాంకు సాధించిన శిరీష మాట్లాడుతూ బ్యాంక్‌ పీవో ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని తెలిపింది. 

Updated Date - 2021-10-22T05:21:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising