అభివృద్ధిలో తలకొండపల్లిని ఆదర్శంగా నిలుపుతాం
ABN, First Publish Date - 2021-10-15T05:11:22+05:30
అభివృద్ధిలో తలకొండపల్లిని ఆదర్శంగా నిలుపుతాం
ప్రొసీడింగ్‌ను అందజేస్తున్న జడ్పీటీసీ వెంకటేశ్
- జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్
తలకొండపల్లి : తలకొండపల్లి మండలాన్ని అన్ని రంగాల్లో అబివృద్ధి పరిచి ఆదర్శంగా నిలుపుతామని జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌నకు రూ.5లక్షలు, దేవుని పడకల్‌కు రూ.5 లక్షలు, గట్టిప్పలపల్లికి రూ.12లక్షలు జడ్పీ నిధుల నుంచి మంజూరైన ప్రొసీడింగ్‌లను గురువారం సర్పంచ్‌లు రమేశ్ యాదవ్, శ్రీశైలం, వైస్ ఎంపీపీ శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీటీసీలు సునితసుదర్శన్‌రెడ్డిలకు అందజేశారు. దశలవారీగా గ్రామాల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, నాయకులు రవికుమార్, జైపాల్‌రెడ్డి, లలితజ్యోతయ్య, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-15T05:11:22+05:30 IST